Home  »  TV News  »  Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

Updated : Feb 12, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

అవన్నీ నాకు ఇష్టం లేవు.. అయినా చేస్తుందంటే ఏమన్నట్లు అని శకుంతల అంటుంది. అప్పుడే ఒకతను కొంతమంది పిల్లలని తీసుకొని వస్తాడు. రుద్ర గారు మీ వల్ల.. ఇప్పుడు మేం చాలా హ్యాపీగా ఉన్నాం.. భాను ప్రతాప్ గారి పేరు మీద మాకు కావల్సిన సదుపాయం కల్పించారు.. అందుకే ఒకసారి భాను గారి ఫోటో చూద్దామని వచ్చామని అతను అనగానే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. పిల్లలు భాను గురించి, రుద్ర గురించి గొప్పగా మాట్లాడుతుంటే శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతుంది. రుద్ర సర్.. భాను గురించి ఎంత బాధపడుతున్నాడో తెలియజేయడానికి వాళ్ళని రప్పించానని గంగ అంటుంది. ఆ పిల్లలు భాను ఫోటో దగ్గరికి వెళ్లి మొక్కుకొని వెళ్తారు. వాళ్ళకి రుద్ర ఒక చెక్ ఇచ్చి పంపిస్తాడు. రుద్ర చేసిన పనికి శకుంతల హ్యాపీ ఫీల్ అయి తన దగ్గరికి వచ్చి తన తలపై చెయ్ వేస్తుంది.

ఆ తర్వాత చూసావా బ్రో శకుంతల అత్తయ్య రుద్ర బావకి పాజిటివ్ అయిందని వీరుతో ఇషిక అంటుంది. గంగ ఇదంతా ఆస్తి కోసం అనుకున్నాను కానీ కాదు గంగకి రుద్ర అంటే ఇష్టం. రుద్రకి కూడా గంగ అంటే ఇష్టం మొదలైతే మనం అనుకున్నది జరగదని ఇషికతో వీరు అంటాడు. మరొకవైపు గంగకి రుద్ర థాంక్స్ చెప్తాడు. అప్పుడే పారు ఎంట్రీ ఇస్తుంది. రాబోయే బాక్సింగ్ కి మనం ఇద్దరం కలిసి ఒకరిని పోటీకి పంపించాలి అనుకున్నాం కదా అని పారు అంటుంది. అవును గంగ నువ్వు పోటీ చెయ్ అని రుద్ర అనగానే పారు షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.